పౌర సరఫరా అధికారుల ఆకస్మిక తనిఖీలు – 15 గృహ LPG సిలిండర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: ఎడపల్లి మండల పరిధిలో పౌర సరఫరా శాఖ అధికారులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎడపల్లి కేంద్రంతో పాటు జానకంపేట్, MSC ఫారం, సాటపూర్ గేట్ ప్రాంతాల్లోని హోటళ్లు మరియు ఆహార వ్యాపార సంస్థలను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్న 15 గృహ వినియోగ LPG గ్యాస్ సిలిండర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

గృహ వినియోగానికి సబ్సిడీపై అందించే LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థల్లో ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని పౌర సరఫరా అధికారులు తెలిపుతూ..
ఈ నేపథ్యంలో సంబంధిత హోటల్ యజమానులపై అత్యవసర వస్తువుల చట్టం ప్రకారం 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల కోసం ఎడపల్లి స్థానిక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
అక్రమంగా గృహ LPG సిలిండర్ల వినియోగాన్ని అరికట్టేందుకు పౌర సరఫరా శాఖ తరచూ తనిఖీలు నిర్వహిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు మరియు వ్యాపార సంస్థల నిర్వాహకులు చట్టబద్ధమైన వాణిజ్య గ్యాస్ కనెక్షన్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment