|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన పాలకూరల పుష్పమ్మ (86) మరణానంతరం కూడా మానవత్వాన్ని చాటుతూ తన నేత్రాలను దానం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో దృష్టి లోపం ఉన్న వారికి వెలుగునిచ్చే అవకాశం కలిగింది.
లయన్స్ క్లబ్ ఎడపల్లి, ఐ హాస్పిటల్ బోధన్ వైద్య బృందం వెంటనే స్పందించి పుష్పమ్మ నేత్రాలను సేకరించింది. అనంతరం వాటిని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. నేత్రదానం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచిన పుష్పమ్మ సేవా భావాన్ని పలువురు కొనియాడారు.
మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన లయన్ అరుణ్ కుమార్ గౌడ్ అమ్మమ్మ అయిన పుష్పమ్మ మరణ వార్తను తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లయన్స్ క్లబ్ సేవా సంస్థ సభ్యులు ప్రార్థించారు. నేత్రదానం వంటి మహోన్నత కార్యక్రమాల ద్వారా మరణానంతరం కూడా జీవితాలకు వెలుగునివ్వవచ్చని వారు పేర్కొన్నారు.








