అంబం వాగులో అడ్డగోలుగా మొరం తవ్వకాలు – భారీ గోతులు.. ఎవరి నిర్లక్ష్యం?

|| దృశ్యం న్యూస్ ||

ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా:
ఎడపల్లి మండలంలోని అంబం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న వాగులో మొరం తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణ పనులు కోసం నీటి పారుదల శాఖ అనుమతులతో మొరం తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తవ్వకాలు ఇష్టారీతిన సాగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జేసీబీ యంత్రాల సహాయంతో ఒక్కేచోట అధిక లోతుగా తవ్వకాలు నిర్వహించడం వల్ల భారీ గుంతలు ఏర్పడుతున్నాయని భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ప్రజల భద్రతకు భంగం కలిగించే విధంగా వాగును ప్రమాదకరంగా మార్చవద్దని కోరుతున్నారు.

ప్రస్తుతం వర్షాకాలం మొదలై వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, తవ్విన భారీ గుంతలు వర్షపు నీటితో నిండిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు హెచ్చరిస్తు, వాగు పరిసర ప్రాంతాల్లో సంచరించే రైతులకు, గ్రామస్థులకు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైన అధికారులు వెంటనే ఈ ప్రాంతాన్ని పరిశీలించి, తవ్వకాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించవద్దని అవసరమైతే ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొరం తవ్వకాలపై కట్టుదిట్టమైన నిఘా అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment