ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు అతన్ని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతు బుధవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన వ్యక్తి మరణించడం జరిగింది.

ఈ సంఘటనపై వర్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ వర్ని మండల ఎస్ఐ జి. రమేష్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై, మృతుని వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వ్యక్తి వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు, ఎత్తు 5′.5″, చామన చాయ రంగు కలవాడు అని సమాచారం తెలిపారు.
మృతుని యొక్క ఆనవాళ్లు ఎవరైనా గుర్తిస్తే వర్ని మండల పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment