మల్కాపూర్ గండి వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోస్ర గ్రామానికి చెందిన యువకుడు గురువారం ఉదయం నిజామాబాద్ వెళ్లడానికి బైక్ పై ప్రయాణం చేస్తుండగా, మల్కాపూర్ గండి వద్ద ఎదురుగా వస్తున్న మినీ ట్రాలీ వ్యాన్ డికొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment