|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన బోడ లక్ష్మణ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. లక్ష్మణ్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబం కావడంతో గ్రామ యువకులు మానవత్వాన్ని చాటుతూ వారి కుటుంబానికి అండగా నిలిచారు.
లక్ష్మణ్ మరణ వార్త తెలుసుకున్న గ్రామ యువత వెంటనే స్పందించి కుటుంబ పరిస్థితిని పరిశీలించారు. అంత్యక్రియల ఖర్చులతో పాటు కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు విరాళాలు సేకరించారు. సోమవారం గ్రామ యువకుల ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు నగదు సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు.
యువత చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తు కష్టకాలంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. గ్రామ యువకుల చేయూతతో దాదాపు రూ.30 వేల వరకు ఆర్థిక సహాయం సమకూరింది జానకంపేట గ్రామ యువత మానవత్వాన్ని చాటుతూ చేసిన ఈ సహాయ కార్యక్రమం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.







