ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్.

ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్.

మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది.
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, డి.ఎస్.పి ప్రసన్న కుమార్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత పోలీసు స్టేషన్ ల ఎస్ఐ మరియు సిఐ లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిశీలించి చట్టప్రకారం పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పైరవీలు లేకుండా పోలీసులకు తెలియజెయ్యడంతో చట్ట ప్రకారం పరిష్కారాలు పొందేలా పోలీసుల కృషి కొనసాగుతుంది. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు, శాంతి భద్రతలు పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారాని డి.ఎస్.పి తెలిపారు.

అదేవిధంగా “ప్రజా సమస్యలను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి వాటిని పరిష్కరించడమే మా ప్రధాన లక్ష్యం.” అని ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు, తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment