వాట్సాప్ లో ఎక్సైజ్ సీఐ అలర్ట్ మెస్సేజ్ : అధికారులకా, బెల్ట్ షాపుల నిర్వహకులకా !

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో అనుమతులు లేని బెల్ట్ షాపులు, లైసెన్స్ లేని షాపులపై ఎక్సైజ్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చెయ్యడానికి శనివారం నిర్ణయించుకున్నారు.

గోప్యంగా ఉంచవలసిన ఈ విషయాన్ని ఎక్సైజ్ సీఐ పవన్ కుమార్ ఫోన్ నంబర్ తో అనుమతుల లేని షాపుల పై తనిఖీలు చేపడుతున్నామని హెచ్చరించే మెసేజ్‌ను వాట్సాప్‌లో పంపించారు..

తనిఖీలకు ముందే ఈ మెసేజ్‌ వాట్సప్ గ్రూపులో పెట్టడం బెల్ట్ షాపు యజమానులు జాగ్రత్త పడటం కోసమేనా ? అధికారుల కోసమా ! అనే విధంగా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..

ఈ మెసేజ్ త్వరగా వేరే వాట్సాప్ గ్రూపుల్లో కూడా చక్కర్లు కొట్టడంతో ఎక్సైజ్ సీఐ పవన్ కుమార్ తీరుపై చర్చలు మొదలయ్యాయి..

అనుమతుల లేని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వార్త కధనాలు వస్తే ఇలాంటి చర్యలు ఏమిటి అని అనేక సందేహాలతో స్థానికుల్లో చర్చనీయాంశం అయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment