|| దృశ్యం న్యూస్ ||
బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి 1వ వార్డు జర్నలిస్టుల కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన విద్యుత్ తీగల దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టినా, దొంగిలించిన తీగలను ఎవరికీ విక్రయించాడన్న అంశంపై స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బాధితుల ఆరోపణల ప్రకారం, దొంగను మాత్రమే పట్టుకోవడం సరిపోదని, దొంగిలించిన విద్యుత్ వైర్లు కొనుగోలు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, నష్టపోయిన వారికి పరిహారం రికవరీ చేసి అందించాలని కోరుతున్నారు.
సంబంధిత పోలీస్ సిబ్బంది వ్యవహారంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, సరైన చర్యలు తీసుకోకపోతే జిల్లా పోలీస్ అధికారిని ఆశ్రయించేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు.








