|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలు నాగమణి దుర్మరణం చెందారు. సమాచారం ప్రకారం, నాగమణి విధులకు వెళ్తుండగా వేగంగా వస్తున్న TG15Z 0070 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని సహచర సిబ్బంది, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటనతో మున్సిపల్ సిబ్బంది, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సహా ఉద్యోగులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








