|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్పేట్ గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి జూద కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నిర్వహించారు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, పౌల్ట్రీ ఫారం సమీపంలో బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న 12 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.14,049/- నగదు మరియు 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసిన వస్తువులను, అరెస్టయిన 12 మంది వ్యక్తులను పాపన్నపేట్ పోలీస్ స్టేషన్కు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి అని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, పేకాట బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు యువతకు ప్రమాదకరంగా ఉంటాయని, మరియు ఇలాంటి సమాచారాన్ని ప్రజలు పోలీసులకి అందించడంలో సహకరించాలని ఎస్పీ తెలిపారు.








