ధర్పల్లి: కత్తెరపొట్ల కలకలం – చికిత్స పొందుతూ మహిళ మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన కోటగిరి దాసు, అదే కాలనీలో నివసించే మచ్చ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

దాసు భార్య తనతో విడిచిపోవడానికి కారణం లక్ష్మియేనని అనుమానంతో, దాసు తనతో తీసుకువచ్చిన బట్టలు కత్తిరించే కత్తెరతో లక్ష్మిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన లక్ష్మి కూతురు గౌతమి కూడా తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు అడ్డుకోవడానికి వచ్చినా వారిపైన కూడా దాసు దాడి చేయడంతో మరికొందరు గాయపడ్డారు. అదనంగా బోజేశ్వర్ అనే వ్యక్తిని కూడా కత్తెరతో పొడిచాడు.

తక్షణమే గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, లక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ధర్పల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment