|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ఎక్కి తీగలపై పని చేస్తుండగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైతు శివకుమార్ విద్యుత్ స్తంభానికి తీగలు బిగించేందుకు పోశెట్టిని ఉదయం తీసుకెళ్లడం జరిగిందని అని ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా నిలిపివేశామన్న నిర్ధారణ లేకుండానే పని ప్రారంభించడంతో విద్యుత్ షాక్ తగిలి పోశెట్టి మృతి చెందాడు అని తెలిపారు.

మృతుడి బంధువులు మాట్లాడుతూ పోశెట్టి కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉండేవాడని, అతని మృతితో భార్య సావిత్రి మరియు పిల్లలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోశెట్టి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు నవిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








