|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ అంశాన్ని వెలికితీసిన టీ న్యూస్ మీడియా ప్రతినిధి తారచంద్ పరిశీలన అనంతరం టీ న్యూస్ ద్వారా కథనం ప్రచురించగా, సంబంధిత అధికారులు స్పందించి క్వారీలను తాత్కాలికంగా మూసివేశారు.

ఈ చర్యను జీర్ణించుకోలేక కొంతమంది క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు, స్థానిక నాయకులు గురువారం రోజు తారచంద్ దిష్టిబొమ్మను దహనం చేసి, అతనిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు.
దీంతో బోధన్ పట్టణంలోని విలేకరులు అందరూ కలసి ఇసుక క్వారీ సంబంధికుల నిరసనను ఖండిస్తు బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు, ఏసీపీ శ్రీనివాస్ లకు వినతి పత్రం అందజేశారు.
విలేకరులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ అసత్య ఆరోపణలు చేసిన క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు, వారికి సహకరించిన ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించబడుతోంది అని విలేకరులు తెలిపారు.








