|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాహాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో దేగం నాగమణి మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
బోధన్ డిపోకు చెందిన TS 16 Z 0212 నంబర్ గల ఆర్టీసీ బస్సులో నుండి దిగి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డుప్రమాదాలపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








