పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ ||

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా, దందా యదేశ్చగా కొనసాగిస్తున్నారు,
సోమవారం మధ్యాహ్న సమయంలో గడ్కోల్ గ్రామంలో గల కప్పల వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై, ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి ఒక జెసిబి, రెండు ట్రాక్టర్లను, పట్టుకొని సీజ్ చేసి సిరికొండ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
తదుపరి విచారణ నిమిత్తం, మైనింగ్ శాఖకు అప్పజెప్పడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై రామ్ మాట్లాడుతూ,
సిరికొండ మండలంలోని, కొండాపూర్,గడుకోల్, రామడుగు, కొండూరు పెద్దవల్గొట్, చిన్నవల్గోట్, గ్రామాలలో గల వాగుల నుండి పోలీసుల కళ్ళు కప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై గట్టి నిఘా ఉంచామని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరికొండ ఎస్ఐ రామ్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment