ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో కోటగిరి సమీపంలో ఎదురుగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాంగి యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు ఆయన భార్య, పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బాధితులను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత ఇంచార్జ్, ఏతొండ రాజేందర్ హాస్పిటల్ కి చేరుకొని బాధిత కుటుంబానికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోకుండా ఉండటంవల్ల ఈరోజు ఓ కుటుంబం రోడ్డు పాలైందని ఇకనైనా తమ నిర్లక్ష్య ధోరణిని వదిలి అక్రమ రవాణా నిరోధించడానికి కఠిన చర్యలు అమలు చేయాలని అధికారులను కోరారు.

ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోటగిరి పోలీసులను కోరుతూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment