|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
బుధవారం ఉదయం బాధితుడు తన ఇంటికి సమీపంలో ఉన్న పాకలో పెంచుకునే పందులు లేవని గమనించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దృశ్యాలు చూడగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పాకకు ఉన్న తాళం పగలగొట్టి పందులను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

ఈ దొంగతనంలో దోచుకున్న పందుల విలువ సుమారు 2.5 లక్షల రూపాయల విలువ చేస్తాయని ఈ విషయమై బుధవారం ఉదయమే ఎడపల్లి పోలీస్ స్టేషన్లో సిసి ఫుటేజ్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసామని పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని దుండగులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు అభ్యర్థించారు.








