పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, భీమ్‌గల్ మండలంలోని సంతోష్ నగర్ తండాలో కొంతమంది వ్యక్తులు మూడు ముక్కల పేకాట ఆడుతున్నారు అనే నమ్మదగిన సమాచారంతో ఎస్సై మహేష్, సిబ్బంది దయానంద్, సుధీర్‌తో కలిసి దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి దగ్గర నుంచి 18,350 రూపాయలు నగదు మరియు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

భీమ్‌గల్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ చర్య, పేకాట ఆడేవారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడాన్ని సూచిస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment