ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ సమయంలో TS 12 UC 1197 నంబర్ గల టిప్పర్ పట్టుబడింది.

పట్టుబడిన టిప్పర్ ను అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలించారాని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు, అదేవిధంగా పోతంగల్ మండలంలో ఇసుక రవాణా పరిరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేస్తూ అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఇసుక అక్రమ రవాణా నియంత్రణ పై ప్రజలు సైతం పూర్తి సహకారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment