|| దృశ్యం న్యూస్ ||
బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు.
మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ఆ ఇద్దరిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ వి. వెంకట్ నారాయణ పట్టుబడిన ఆకతాయిలను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరు పరచడంతో యువకులకు రెండు రోజుల రిమాండ్ విధించారు.
ఈ చర్యతో యువతులను వేధించే ఘటనలను అరికట్టడానికి పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ సంఘటన ద్వారా మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్ మరోసారి తన సమర్థతను చాటింది అని. మహిళలు తమకు ఇలాంటి సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.








