|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం తానాకాలన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం క్రెడిట్ కార్డు డి-యాక్టివేట్ కావడంతో గూగుల్లో బ్యాంక్ యొక్క అధికారిక మెయిల్ ఐడీని వెతికి, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కోసం అభ్యర్థన పెట్టడంతో అతనికి తిరిగి వచ్చిన సందేశంలో ఉన్న లింక్ ద్వారా అతని అకౌంట్ వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లాయి. ఫలితంగా అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు 28,000 రూపాయలు కాజేశారు.
ఈ ఘటనపై బాధితుడు, సంబంధిత బ్యాంక్ అధికారులకు సంప్రదించగా సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయమై ఎడపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సైబర్ నేరగాళ్ల నుండి రక్షించుకోవడానికి ఏదైనా ఆన్లైన్ లావాదేవీలు తెలియని వ్యక్తులచే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు, OTPలు ఇవ్వకూడదని పోలీస్ అధికారులు సూచిస్తు, ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ మోసాలు నుండి భద్రంగా ఉండాలని కోరుతున్నారు.








