లింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ తన సహచరులైన స్థానిక బిజెపి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సందర్శించారు.
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు అందాలని, వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం పద్మగంగ వీరయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పల్లికొండ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జల ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, పద్మ జగదీశ్వర్, బోగా రాఘవంద్ర, కొప్పుల నర్సయ్య, భూమేశ్వర్, ప్రభాకర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జల ప్రసాద పంపిణీ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు శ్రద్ధతో సేవలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment