వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదాని, ఆమె తమ బంధువుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని కొన్ని రోజులకైనా తిరిగి వస్తుందని భావించామని ఆమె ఇన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో గత మూడు రోజులు క్రితం నుండి లాలూ బాయి కుటుంబ సభ్యులు వారి బంధువులను, స్థానికులను సంప్రదించిన ఆమెను కనుగొనలేకపోయారు.

ఈ నేపథ్యంలో, లాలూ బాయి కూతురు వంకడి లక్ష్మి సోమవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి తెలిపారు.

ఇలాంటి సంఘటనలు సమాజంలో చింతన కలిగిస్తున్నాయని ఇలాంటి వృద్ధులు కానీ ఎవరైనా కానీ ఆచూకీ లభ్యం కానిచో ఎక్కువ సమయం వృధా చెయ్యకుండా వెంటనే పోలీసులను సంప్రదించడం అత్యంత అవసరం అని తెలుపుతూ మీ పరిచయాలలో ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి వారిని కాపాడటానికి తగు చర్యలు చేపడుతామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment