గ్రామంలో భయాందోళన కలిగించిన ఆవు : పలువురికి తీవ్ర గాయాలు

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఆవు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది, గురువారం సాయంత్రం ఆవు గ్రామంలోని ప్రధాన విధులలో తిరుగుతూ కనబడిన వారందరినీ గాయపరుస్తూ పరుగులు తీసింది, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అ క్రమంలోనే ఆవు ప్రధాన రహదారి పై పరుగులు పెడుతు ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది, ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి, గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో కలిసి ఆవును అదుపులోకి తీసుకున్నారు.

మండల వైద్య అధికారి వచ్చి అవును పరిశీలించగా ఆవు గత కొంత కాలం క్రితం కుక్క గాయపరచడం వల్ల రేబిస్ వ్యాధి సోకిందని ఈ వ్యాధి వల్ల ఇలా ప్రవర్తించిందని వైద్యులు తెలిపారు.

వ్యాధి తీవ్రత పెరగడం, ఆటోను డీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆవు రాత్రి మరణించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment