|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు మరియు ఎంపీలు ప్రధానమంత్రితో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణ రాజకీయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి మోదీని శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పలు ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికల పై సమగ్ర చర్చ నిర్వహించి, ముఖ్యంగా భవిష్యత్తులో పార్టీని మరింత బలపడించేందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.

తెలంగాణ బీజేపీకి చెందిన 18 మంది ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం, రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేయడం మరియు కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై పార్టీ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.








