|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు ముందే సద్దుల బతుకమ్మ పండగ ఘనంగా నిర్వహిస్తారు, కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఈ పండగ ప్రతీ సంవత్సరం దసరా అనంతరం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం బతుకమ్మ పండగను అక్టోబర్ 15న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎడపల్లిలో ఈ పండగకు ప్రత్యేకమైన కారణాలున్నాయి. దసరా అనంతరం పౌర్ణమి తిధి లోగా పండగ జరుపుకోవడం అనేది గ్రామంలో పూర్వీకుల నుండి వస్తున్నా ఒక ఆనవాయితీగా మారింది.
బతుకమ్మ పండగ గురించి గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామస్తులు ఈ పండగను దసరా తరువాత జరుపుకునేందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు.
మొదటి కారణం :
ఆడపడుచుల కోసం ఆలస్యంగా జరుపుకోవడం దసరా పండుగ సమయంలో ఆడపడుచులు సాధారణంగా తమ అత్త వారి ఇంట్లో ఉంటారు కనుక దసరా తర్వాత బతుకమ్మ జరుపుకుంటే అందరు కలిసి పండగను ఎంతో ఘనంగా జరుపుకోవడం సాధ్యం అవుతుంది ఓ కారణం అయితే
రెండవ కారణం :
గతంలో గడిలో బతుకమ్మ పండగ జరుపుకునే సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగిందని గ్రామంలో ఆ సంఘటన ప్రభావం చూపించిందని, అప్పటి దేశముఖ్ పాలనలో సిపాయి తుపాకీ పొరపాటున సరిగ్గా పేలకపోవడంతో ఒక వ్యక్తి మరణించడం జరిగిందని, అ సంఘటన అశుభాకంగా భావించి గ్రామస్థులు దసరా తరువాత ఈ పండగ నిర్వహించడం ప్రారంభించారాని తెలిపారు.
ఎడపల్లిలో జరిగే బతుకమ్మ పండగ కోసం గ్రామస్తులు కొన్ని రోజుల ముందు నుంచే గునగ పువ్వులను సేకరించడం ప్రారంభింస్తారు, ఈ పువ్వులు గ్రామం చుట్టూ అటవీ ప్రాంతం నుండి సేకరించి నిలువెత్తు బతుకమ్మలు తయారు చేసి పండగలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా చేస్తారు.
బతుకమ్మలను తయారు చేయడానికి గ్రామస్తులు పోటీపడుతు ఈ ప్రక్రియలో నిలువెత్తు బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు మగవాళ్లు ప్రధానంగా పాల్గొనటం జరుగుతుంది.
ఈ పండుగకు గ్రామనికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ వేడుకలను చూడడానికి భారీగా తరలివస్తారు. మొదటి బతుకమ్మ చెరువు వద్ద ఉండగా, చివరి బతుకమ్మ దేశముఖ్ గడీ వద్ద ఉంటుంది.
ఈ వేడుకలు అనేక గ్రామస్తుల మధ్య సామరస్యాన్ని పెంచుతాయి సద్దుల బతుకమ్మ పండగ గ్రామంలో సాంఘిక, సాంస్కృతిక ఉత్సవం గా మారింది, ఇది గ్రామస్తుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది.
సద్దుల బతుకమ్మ పండగ స్నేహబంధాలను, సాంఘిక ఉత్సవాలను మరియు పండుగ సంస్కృతిని ప్రతిబింబించడానికి ఒక గొప్ప అవకాశంగా ప్రజలు భావిస్తారు.
ఈ సంవత్సరం ఎడపల్లి మండల కేంద్రంలో జరగనున్న సద్దుల బతుకమ్మ పండగ గ్రామంలో జరిగే ఈ ఉత్సవాలు, సాంస్కృతిక సంపదను తెలంగాణ సంప్రదాయాలను పునరుద్ధరించడంతో పాటు, యువతకు, పిల్లలకు ఒక మంచి సందేశం ఇవ్వడం ద్వారా, గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరిని సంతోషంతో మంచి సంబంధాలను ఏర్పడేలా చేస్తాయి.
బతుకమ్మ పండుగ ఆనవాయితీగా భవిష్యత్తుకు వెళ్లే దారిని నిర్ధారించడంలో మన సంస్కృతికి ఎంతగానో సహాయపడుతుంది.








