|| దృశ్యం న్యూస్ ||
భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) లో చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో శశాంక్ పార్టీ లోకి కండవా వేసి ఆహ్వానితులయ్యారు.

ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ, నేను బిజెపి పార్టీ శ్రేయస్సు కోసం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకై కష్టపడతాను అని, నా వంతుగా పార్టీ కోసం అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి మద్దతు ఇస్తాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడ్డుకుంట్ల శ్రీనివాస్, నస్రుల్లాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు సున్నం సాయిలు, వర్నీ మండల అధ్యక్షుడు శంకర్, రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.








