మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు – ₹88 కోట్లతో మెరుగైన వృద్ధి | ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

– కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు ₹5.33 కోట్ల చెక్కుల పంపిణీ.
– 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణం.
– మెదక్‌లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు.
– ప్రభుత్వ అధికారులు కమీషన్ అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి.

మెదక్ అభివృద్ధి కోసం ₹88 కోట్లతో పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. గురువారం మెదక్ స్టేడియంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 66 మంది లబ్ధిదారులకు ₹66.07 లక్షల చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం ₹5.33 కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మెదక్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని తెలిపారు.

వైద్య సేవలకు మెరుగుదల కోసం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేశామని, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు కమీషన్ అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

అంతకుముందు, మెదక్ పాత బస్టాండ్ సమీపంలో ఇలియాజ్ మెడికల్ స్టోర్ ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment