10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ – 19న రవీంద్రభారతిలో సన్మానం.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఈ ఫలితాల్లో భాగంగా పాఠశాల విద్యార్థిని వడ్ల సాత్విక 600లో 574 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలవడం విశేషం. సాత్విక సాధించిన ఈ విజయంతో పాఠశాలకు మంచి పేరు తెచ్చింది.
అదేవిధంగా భావన మరియు బి. రాజేశ్వరి అనే విద్యార్థినులు ప్రతి ఒక్కరూ 563 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పాఠశాలలో మొత్తం 17 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది.

ప్రభుత్వ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు అధిక మార్కులు సాధించడం విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది.. ఈ విజయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కష్టపడే స్వభావం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా ఐ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రతిభావంతుల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో వడ్ల సాత్విక, భావన, రాజేశ్వరి ఎంపికై మే 19న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సన్మానం పొందనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment