మెదక్‌: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదనంగా రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో నిందితుడు బావమరిది సంతోష్ తన బావపై ద్వేషం పెంచుకుని పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2023లో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్ఐ రాజు కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి సీఐ సంజయ్ కుమార్ దర్యాప్తు చేపట్టి, సంఘటనా స్థల పరిశీలనతో పాటు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. పూర్తి ఆధారాలతో చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయగా, విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితుడికి జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో పోలీసు సిబ్బంది కృషిని ఎస్పీ అభినందించారు. కుటుంబ వివాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment