తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కుర్నపల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు ఘట్క చిన్న అబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తన తమ్ముడి కుటుంబానికి చెందిన పెద్ద కుమారుడు ఘట్క సాయి కుమార్, చిన్న కుమారుడు ఘట్క శ్రీనివాస్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇందులో చిన్న కుమారుడు ఘట్క శ్రీనివాస్‌పై నాలుగు నెలల క్రితం వర్ని పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. తమ్ముడు జైలులో ఉండటం వల్ల అన్న తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అతడిని జైలు నుంచి విడుదల చేయించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై
ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి క్షణిక ఆవేశంలో గుర్తుతెలియని క్రిమిసంహారక మందు సేవించాడు.

అనంతరం వాంతులు చేయడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రశ్నించగా, తాను పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ రమ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment