మెదక్: మరో జూద స్థావరంపై దాడి – 9 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో జూదంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ప్రత్యేక దళ బృందం కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్యల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.28,296 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక కారు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిని కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో పేకాట, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, యువత తప్పుదారుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అక్రమ జూదంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment