పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన పద్మశాలి మానాజీ (45) మద్యానికి బానిసై తరచూ తన తల్లి పద్మశాలి భూమవ్వ (70)తో డబ్బుల విషయంలో గొడవపడుతూ ఉండేవాడని సమాచారం.

వృద్ధురాలికి వచ్చే ప్రభుత్వ పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని, తరచు ఇల్లు అమ్మివేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆమె నిరాకరించడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది.
నిన్న రాత్రి ఆగ్రహానికి లోనైన మానాజీ ఖాళీ గాజు సీసాతో తల్లి తలపై బలంగా కొట్టి, అనంతరం రోకలి కర్రతో పలు మార్లు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనను ప్రమాదంలా మలచేందుకు ప్రయత్నిస్తూ, అర్ధరాత్రి సమయంలో తల్లి శవంపై దీపనూనె పోసి నిప్పంటించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మెడ భాగం వద్ద, కాళ్ల మోకాళ్ల వరకు కాలిన గాయాలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న కోటగిరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కుటుంబ బంధాలను డబ్బు కోసం తాకట్టు పెట్టిన ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment