|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కోళ్ల పెంపక కేంద్రం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఈ పౌల్ట్రీ ఫారం కారణంగా గ్రామంలో తీవ్ర దుర్గంధం వాతావరణం వ్యాపించి గ్రామస్తులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
రెండేళ్ల క్రితం “సొనవేట్” పేరుతో అనుమతులు పొందిన సంస్థ స్థల రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రస్తుతం “శాలిమార్ హేచరీస్ లిమిటెడ్” పేరుతో వేల సంఖ్యలో కోళ్లను పెంచుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు, అయితే గ్రామ పంచాయతీ అనుమతి, భవన నిర్మాణ అనుమతి, పౌల్ట్రీ ఫారం స్థాపన అంగీకారం, పశుసంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఫైర్ సేఫ్టీ, కార్మిక శాఖల నుండి సరైన అనుమతులు లేకుండానే నూతన సంస్థ గత సంస్థ పేరిట కేవలం స్థల మార్పిడి పత్రాలతో వ్యాపారం కొనసాగిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ కేంద్రం వల్ల గత కొన్ని నెలలుగా గ్రామ పరిసరాల్లో దుర్వాసన తీవ్రంగా పెరిగి పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, జ్వరాలు, వాంతులతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నా, ఈ కేంద్ర నిర్వహణ తీరుపై గ్రామ పంచాయతీ కార్యదర్శి రెండు సార్లు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు తెలిపిన, ఈ సంస్థ కార్యకలాపాలపై గ్రామస్తులు ఉన్నతా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక ప్రజల సమస్య పరిష్కారంలో పురోగతి కనిపించలేదని వాపోతున్నారు.
ఈ సంస్థకు రాజకీయ, అధికారుల అండదండలు, గ్రామ పాలకవర్గం, గ్రామ పెద్దల అండదండలతో నిర్వాహకుల నుండి ఆర్థిక ఆదరణ పొందుతూ సంస్థకు అనుకూలంగా మద్దతు తెలుపుతున్నారాని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోని వేళా ప్రజలు అనారోగ్య సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందాలంటే గ్రామ ప్రజలే సంఘటితమై ఈ సమస్యపై పోరాటానికి సిద్ధం కావాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.








