|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై కన్న తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘట్టం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా అందిన సమాచారం మేరకు, సదరు వ్యక్తి గత కొంతకాలంగా తన కూతురిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తల్లి ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేసి బెదిరించినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికపై దారుణం జరిపి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు అని, అయిన ఈ ఘటన భయంతో కూతురు తల్లికి చెప్పినా, పరువు పోతుందనే ఆలోచనతో ఆ విషయాన్ని బయటపెట్టలేదు. కాగా ఇటీవల రాత్రి సమయంలో మళ్లీ బాలికపై లైంగిక దాడి జరగడంతో, నిద్రలో మేల్కొన్న భార్య అడ్డుకునే ప్రయత్నంలో ఆమెను కూడా బెదిరించాడని, ఈ దుర్మార్గపు చర్య అధికామయ్యే అవకాశం ఉండటంతో బుధవారం బాలిక తల్లి ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ విషయమై ఎడపల్లి ఎస్సై ముత్యాల రమను సంప్రదించగా, విచారణ కొనసాగుతున్నందున వివరాలు వెల్లడించలేమని తెలిపారు. బాలికల భద్రత కోసం ఇలాంటి సంఘటనల వ్యక్తిగత వివరాలు గోప్యత పాటించిన, దుర్మార్గపు ఇలాంటి ఘటనల చర్యలు దాచకుండా, చట్టపరమైన చర్యలు ప్రజలకు తెలియచెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే ప్రజలు తగిన చర్యలతో భద్రతగా వుండే ప్రయత్నం చేస్తారని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.








