|| దృశ్యం న్యూస్ ||
మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ మండలం కోమటూరు పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్యెల్యే “ప్రతి మత్స్యకార కుటుంబానికి స్థిరమైన ఉపాధి కల్పించడమే మా లక్ష్యం” అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 1,84,500 చేప పిల్లలు చెరువులో విడుదల చేశారు.

జిల్లాలోని 546 చెరువులలో రూ.200.88 లక్షల విలువ గల 211.39 లక్షల చేప పిల్లలు సరఫరా చేయబడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో 39 పెరినియల్ చెరువులలో 63.28 లక్షల పెద్ద సైజు చేపపిల్లలు, 507 సిసనల్ చెరువులలో 148.10 లక్షల చిన్న చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు వివరించారు.
అదేవిధంగా అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. కోమటూరు చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు రోహిత్ రావు తెలిపారు.








