|| దృశ్యం న్యూస్ ||
బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో మొత్తం 24 మంది విద్యార్థులతో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులు సంజయ్ తలారే ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడంలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు 8800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, పేద విద్యార్థులపై వివక్షను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అలాగే హాస్టల్ విద్యార్థులకు మేస్ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్న విద్యార్థుల బకాయిలు 250 కోట్లు, కళాశాలల బకాయిలు 350 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీలో అధ్యక్షురాలిగా సౌజన్య, కార్యదర్శిగా సాయి వివేక్, ఉపాధ్యక్షులుగా జ్యోతి, సంతోష్, దీపక్, సహాయ కార్యదర్శులుగా స్వాతిక, దినేష్, రోజా, కోశాధికారిగా డాన్, ప్రచార కార్యదర్శులుగా అన్నం, నరేందర్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంబ్ల్ లాలు, కళ్యాణ్, సంజు, మంగేష్ తదితరులు పాల్గొన్నారు.








