15 దోపిడీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత – కామారెడ్డి పోలీసుల చాకచక్యం.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా పోలీసు బలగాలు మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించాయి. రిపైర్ షెడ్ నుండి కారు, వెహికిల్ స్కాన్నర్స్, బ్యాటరీలు, AC ప్యానెల్ మరియు CCTV హార్డ్‌డిస్క్‌లను దొంగిలించిన కేసులో అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి సీసీటీవీ ఆధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు. నవంబర్ 8న నర్సన్నపల్లి కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు కామారెడ్డి జిల్లా దేవునిపల్లి, సదాశివనగర్, భిక్కనూర్ పరిధిలో 15 దొంగతనాలు, అదనంగా నిజామాబాద్ రెంజల్, నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ రఫీక్ (27), నిర్మల్ జిల్లా తానూర్ మండలానికి చెందినవాడు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “నిందితులు పోలీసుల చేతికి చిక్కకుండా ఎప్పటికీ తప్పించుకోలేరు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment