|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బి.శ్రీనును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 6, 2025న బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జూదం కేసులో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. నిందితులకు విధించిన జరిమానా వసూలు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఎస్పీ దృష్టికి రావడంతో, కానిస్టేబుల్ బి.శ్రీను పైన క్రమశిక్షణాత్మక చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు.
తెలంగాణ సివిల్ సర్వీస్ మరియు (CC&A) రూల్స్, 1991 ప్రకారం ఎస్పీ కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో కానిస్టేబుల్ ప్రధాన కార్యాలయం బాన్సువాడగానే ఉంటుంది అని, మరియు ముందస్తు అనుమతి లేకుండా ఆ స్థలాన్ని విడిచి వెళ్లరాదు అని, ఈ ఉత్తర్వులు బాన్సువాడ ఎస్‌హెచ్‌ఓకు ఎస్పీ ఆదేశించారు.








