|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అకన్నపేట గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వలన జరిగే అనర్ధాలు మరియు ఆత్మహత్యల నివారణపై సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామాయంపేట ఎస్ఐ బాలరాజు, కలాబృందం సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని సమన్వయించారు.
గ్రామస్తులకు ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, బ్యాంకు OTPలు, వ్యక్తిగత వివరాల రహస్యత గురించి వివరించారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకూడదని, ఎటువంటి ఆన్లైన్ మోసం ఎదురైనా వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వాలని సూచించారు.
రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం నడుపుతూనే మొబైల్ వినియోగించకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు.
యువత మత్తు పదార్థాల వలన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. జీవిత సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, సాయం కోసం కుటుంబం లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కలాబృందం సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సందేశాత్మక నాటికలు, పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.








