నిజాంసాగర్‌లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో చిక్కాడు. గతంలో 06.02.2025న శంకర్ పై రూ.50,000 బైండోవర్ విధించి, ఒక సంవత్సరం పాటు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. అయితే 10.08.2025న మళ్లీ అదే దాబాలో సిట్టింగ్ నిర్వహించడంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. దీనిపై నిజాంసాగర్ ఎస్ఐ మళ్లీ ఎమ్మార్వో వద్ద బైండ్‌డౌన్ చేసి రూ.50,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ – “జిల్లాలోని దాబాల యజమానులు మద్యం విక్రయాలు లేదా సిట్టింగులు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ఒకసారి బైండోవర్ అయిన తరువాత మళ్లీ ఉల్లంఘన చేస్తే భారీ జరిమానాలు, కేసులు తప్పవు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment