మెదక్ గాంధీనగర్‌లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా గాంధీనగర్‌లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్‌కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా విధించారు. 20 ఏళ్ల కోసిక విజయ్, విలియమ్స్‌తో మద్యం సేవించి వాగ్వాదానికి దిగడంతో ఆవేశంలో కర్రతో దాడి చేసి హత్య చేశాడు.

ఈ ఘటనపై అప్పటి సీఐ నాగరాజు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపారు. ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ డి.మహేష్ సాక్ష్యాధారాలు సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.వెంకటేష్ కోర్టులో వాదనలు వినిపించారు. లైసనింగ్ ఆఫీసర్ ఎస్ఐ బి.విఠల్, సీడీఓ లు రవీందర్ గౌడ్, రామయ్య విచారణలో కీలక పాత్ర పోషించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment