|| దృశ్యం న్యూస్ ||
హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన దేశ చట్టాన్ని, మానవత్వాన్ని తాకట్టు పెట్టిన దారుణ చర్యగా భాజపా నేతలు ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా భాజపా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి పార్టీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో నిందితుడు ఇబ్రహీంను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కోరారు.
భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో గో సంరక్షణ చట్టం (Cow Protection Act) ను వెంటనే అమలు చేసి, గోవుల పవిత్రత, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ, గోరక్షకులపై దాడులు నిరోధించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.








