|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ రోజు వేకువజామున కుల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామం ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 370 పీడీఎస్ బియ్యం సంచులు (ప్రతి సంచి 50 కిలోలు) తీసుకెళ్తున్న ఒక DCM వాహనాన్ని పోలీసులు ఆపి స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వాహనం మరియు బియ్యాన్ని కుల్చారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టము అని. పోలీసులు ఎల్లప్పుడూ నిఘా కొనసాగిస్తారు” అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలన ఎస్పీ కోరారు.








