|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా నిర్వహించబడింది. పోలీసులు నిందితుల వద్ద నుండి రూ. 58,060/- నగదు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసిన వస్తువులు మరియు నిందితులను చేగుంట పోలీస్ స్టేషన్కు అప్పగించి, కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలు ఇలాంటి అక్రమ పేకాట, జూదం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.








