మెదక్ జిల్లా మహిళా హత్య కేసు – సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుపాయల వద్ద మొదటి వంతెన సమీపంలోని వెంచర్‌లో జరిగిన మహిళా హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి సమగ్ర విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నిందితులను గుర్తించి త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి త్వరలో నిందుతులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, కూల్చారం ఎస్ఐ మోహినొద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment