|| దృశ్యం న్యూస్ ||
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా లోన్ యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, APK ఫైల్ మోసాలు, క్రిప్టో కరెన్సీ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
లోన్ యాప్‌ల ద్వారా తక్కువ వడ్డీగా లోన్ ఇవ్వడంటూ వ్యక్తిగత సమాచారం తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని హెచ్చరించారు. జాబ్ మోసాల్లో, ఫీజు పేరుతో డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. APK ఫైళ్లను గుర్తు తెలియని లింకుల ద్వారా డౌన్లోడ్ చేయొద్దని, ఫోన్ డేటా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. బిట్‌కాయిన్/క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లు కూడా నకిలీవే అని అన్నారు.
సైబర్ మోసానికి గురైతే 1930 నంబరుకు కాల్ చేయాలీ లేక www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. గోల్డెన్ అవర్స్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.








