క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం: ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానాలు లేని పరిస్థితిలో కూడా, ఇందూరు క్రీడాకారులు తమ ప్రతిభ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.

ఇటీవల జరిగిన టైక్వాండో టోర్నమెంట్ మూడు రోజుల క్రీడల కార్యక్రమాన్ని ఎమ్యెల్యే జ్యోతి ప్రదర్శనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, కానీ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు క్రీడాకారులకు తగిన మద్దతు ఇవ్వలేదని, క్రీడాకారులకు అవసరమైన మైదానాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతే, యువ క్రీడాకారుల ప్రతిభ మరింత మెరుగ్గా వెలికితీస్తుందని అన్నారు.


గతంలో కలెక్టర్ కు క్రీడా మైదానం ఏర్పాటుకు వినతిపత్రాలు సమర్పించబడినా, ప్రభుత్వం అవసరమైన కేటాయింపులు చేయకపోవడం దారుణమని ధన్ పాల్ పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో, ఇందూరు క్రీడాకారుల కోసం అన్ని వసతులతో కూడిన మైదానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చూపిస్తామని ఎమ్మెల్యే ధన్ పాల్ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment