|| దృశ్యం న్యూస్ ||
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఫిర్యాదుదారుని ఫైల్ ప్రాసెస్ చేసేందుకు రూ.10,000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారుల వలలో చిక్కాడు.
అలాగే, సికింద్రాబాద్ పద్మారావు నగర్ సబ్ డివిజన్ లాలగూడ సెక్షన్ TGSPDCL సబ్ ఇంజనీరు మరియు ఇంచార్జి సహాయక ఇంజనీరు భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి, విద్యుత్ పనికి సంబంధించిన పత్రాలను ప్రాసెస్ చేయడం కోసం రూ.15,000/- లంచం స్వీకరిస్తూ ACB అధికారుల చేతికి చిక్కాడు.
ఫిర్యాదుదారుడు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ పనిలో సింగిల్ ఫేజ్ మీటర్లను త్రీ ఫేజ్ మీటర్లుగా మార్పు చేయడం మరియు 63 KVA ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు అంచనా ప్రతిని సిద్ధం చేయడం కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
టెలంగాణ అవినీతి నిరోధక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయవచ్చు అని, లేదా అదనంగా వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని ACB అధికారులు ప్రజలకు హామీ ఇస్తున్నారు.








